TET - COMPUTER BASED TEST

*☘టెట్‌--2017☘*
కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం(సీబీటీ)లోనే దీనిని నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు పేపర్‌-1, 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2లను వేర్వేరుగా నిర్వహించనున్నారు.
*పేపర్‌-1 అర్హత ఇదీ.*.(1-5వ తరగతి)
ఇంటర్మీడియట్‌లో 50% మార్కులుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45%చాలు. అలాగే డీఎడ్‌ లేదా నాలుగేళ్ల బీఈఎల్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
*పేపర్‌-2 అర్హత ఇదీ.*.(6-8వ తరగతి)
బీఏ, బీఎస్సీ, బీకాంలలో ఏదైనా ఒక కోర్సు 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులు ఉండాలి. బీఎడ్‌ లేదా బీఎడ్‌-స్పెషల్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
లేదా నాలుగేళ్ల బీఏ, బీఎస్సీని 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులుండాలి.
లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన ఒక అప్షనల్‌ కోర్సుతో డిగ్రీ లేదా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ కోర్సు లేదా లిటరేచర్‌ డిగ్రీ లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన పీజీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ లేదా లాంగ్వేజ్‌ సంబంధిత బీఎడ్‌ కలిగి ఉండాలి.ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ బీఎడ్‌ లేదా బ్యాచిలర్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకావొచ్చు. అయితే వారు డీఎస్సీకి ఈ టెట్‌ సర్టిఫికేట్‌తో హాజరుకాకూడదు.
వీటితో పాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన వాటిలో డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉండాలి. అలాగే ఆర్‌సీఈ గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌, బీఎడ్‌- స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన కోర్సునే ఇంటర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే యూజీసీ గుర్తింపు పొందిన బ్యాచిలర్‌ డిగ్రీని పరిగణలోకి తీసుకుంటారు.
*నెగిటివ్‌ మార్కుల్లేవు*
మొత్తం ప్రశ్నలు కేవలం మల్టిపుల్‌ చాయిస్‌ తరహానే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఇస్తారు,
నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అయితే, ఇందులో ఎలాంటి నెగిటివ్‌ మార్కులు ఉండవు. పేపర్‌-1, పేపర్‌-2కి కూడా ఇదే నియమం వర్తిస్తుంది.
*ఎనిమిది భాషల్లో ఒకటి ఫస్ట్‌ లాంగ్వేజ్‌*
తెలుగు, ఉర్దూ, హిందీతో సహా నిర్దేశిత 8 భాషల్లో ఒకదాన్ని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు. అయితే వారు ఆ భాషా మధ్యమంలోగానీ, లేదా దానిని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా పది వరకు కచ్చితంగా చదివిగానీ ఉండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ ఈల్లో చదివిన వారు వీటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు.
రెండో లాంగ్వేజ్‌ కింద అందరికీ ఇంగ్లిష్‌ ఉంటుంది. ఇక గణితం, పర్యావరణంలో 5వ తరగతి వరకు బోధించగలిగేలా ఉండాలి.
మల్టిపుల్‌ ప్రశ్నలు సబ్జెక్టుతో పాటు బోధనకు సంబంధించి కూడా ఉంటాయి. గణితంలో 24 ప్రశ్నలు సబ్జెక్టుకు సంబంధించి ఉంటే, 6 ప్రశ్నలకు బోధనకు సంబంధించి ఉంటాయి. ఇదే విధానం పర్యావరణ ప్రశ్నల్లోనూ ఉంటుంది. లాంగ్వేజ్‌ పేపర్లు కమ్యూనికేషన్‌, సమర్థతను పరీక్షించేలా ఉంటాయి. దీనికి సంబంధించిన 30 ప్రశ్నల్లో 6 బోధనకు సంబంధించినవి ఉంటాయి.
పేపరు 2లో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, సంస్కృతంలో ఒక భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.
లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు ఇది వర్తించదు. అయితే, వారు పది వరకు కచ్చితంగా ఆ మాధ్యమంలో లేదా ఆ భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్‌ పండిట్‌ల అభ్యర్థులు వారి పండిట్‌ శిక్షణకు సంబంధించిన దానిని ఎంచుకోవాలి. కాగా, సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ అభ్యర్థులు వారు చదివిన దానిని ఎంచుకోవచ్చు.
గణితం, సైన్స్‌లో 24 ప్రశ్నలకు సబ్జెక్టు, ఆరు ప్రశ్నలు బోధనకు సంబంధించి ఉంటాయి. ఫిజికల్‌ సైన్స్‌లో 12 ప్రశ్నలు, బయాలజీ సైన్స్‌లో 12 ప్రశ్నలు, సైన్స్‌ బోధనలో 6 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్ లో చరిత్ర, భౌగోళిక, సివిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులు వస్తాయి.
మొత్తం 60 ప్రశ్నల్లో 48 సబ్జెక్టు, 12 బోధనకు సంబంధించినవి ఉంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌లో 12వ తరగతి స్థాయిలోని ప్రశ్నలూ ఉంటాయి. లాంగ్వేజ్‌ పేపర్లలో 12వ తరగతి స్థాయిలో కమ్యూనికేషన్స్‌, సమర్థత ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.
ప్రశ్నా పత్రాలు సంస్కృతం తప్ప అన్ని భాషల్లోనూ ఉంటాయి. ఒకవేళ సంస్కృతం ఎంచుకుంటే దేవనగరి స్ర్కిప్ట్‌లో తెలుగులో ఉంటుంది
*అర్హత మార్కులు*
జనరల్‌-60, బీసీ-50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్ మెన్‌-40 మార్కులు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దీనికి సంబంధించిన మెమోలు, పాస్‌ సర్టిఫికెట్లు అభ్యర్థులకు అందజేస్తారు.
టెట్‌ సర్టిఫికేట్‌ కాలపరిమితి 7 ఏళ్లు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మార్కుల మెరుగు కోసం మళ్లీ హాజరుకావచ్చు.
డిజిటల్‌ విధానంలో ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనిలో అక్రమాలకు అవకాశం లేకుండా అభ్యర్థి పేరు, మార్కులు, చిరునామాలతో జారీచేస్తారు. దివ్యాంగులకు కనీసం 40% అంగవైకల్యం ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు.
టీచర్ల భర్తీలో టెట్‌ స్కోర్‌కు 20% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 80% ఉపాధ్యాయ భర్తీ పరీక్షకు ఉంటుంది.ఏటా జూన్‌ లేదా జులై, అక్టోబరు లేదా నవంబరులో టెట్‌ పరీక్ష ఉంటుంది. ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.
*కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌*
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు, ఆమోదం, పరీక్ష కేంద్రం కేటాయింపు, హాల్‌టిక్కెట్ల జారీ, అభ్యర్థులకు అవగాహన, మాక్‌ టెస్ట్‌ తదితర సమాచారం అంతా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు.ఒక్కో కేంద్రం ఒకేసారి 5 వేల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments