1.ఆరు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది.దీంతో ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే ఇక్కడి వారికి సంబంధించినవారమని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉత్తర్వులు ముస్లింలపై వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ హవాయి, మేరీల్యాండ్ కోర్టులు స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు అమోదం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : అమెరికా సుప్రీం కోర్టు
ఎందుకు : అక్రమ వలసలు నిరోధించి ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు
2.ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2017 సంవత్సరానికి సిరియాకు చెందిన 16 ఏళ్ల మహ్మద్ అల్ జౌండెకు లభించింది.సిరియాలోని బాలల శరణార్థుల హక్కుల కోసం పోరాడుతున్నందుకుగాను జౌండేను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కిడ్‌సరైట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. నెదర్లాండ్‌సలోని హేగ్ నగరంలో డిసెంబర్ 5న జరిగిన కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేతుల మీదుగా మహ్మద్ ఈ బహుమతిని అందుకున్నాడు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో శరణార్థులుగా మారుతున్న బాలల కోసం మహ్మద్ కుటుంబం శరణార్థుల శిబరంలోనే పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2017
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : మహ్మద్ అల్ జౌండె
ఎందుకు : సిరియాలోని బాలల శరణార్థుల హక్కుల కోసం పోరాడుతున్నందుకు
3.కేంద్ర ప్రభుత్వ రుణ భారం 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 2.53 శాతం పెరిగింది.ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.64,03,138 కోట్లున్న ప్రభుత్వ రుణం, సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి రూ.65,65,652 కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వ రుణ నిర్వహణ విభాగం ప్రకటించింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణ వాటా 93 శాతం. ఇందులో మార్కెట్ బాండ్ల వాటా 82.6 శాతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 65 లక్షల కోట్లు దాటిన ప్రభుత్వ రుణ భారం
ఎప్పుడు : డిసెంబర్ 5 (2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో)
ఎక్కడ : కేంద్రంలో
- సరుకుల ఎగుమతి పథకం (ఎంఈఐఎస్) ప్రోత్సాహకాలను రెడీమేడ్ గార్మెంట్స్‌పై 2 శాతం పెంచారు. దీంతో ఎంఈఐఎస్ వార్షిక బడ్జెట్ 34 శాతం పెరిగి రూ.8,450 కోట్లకు చేరింది.
- సేవల ఎగుమతుల పథకం (ఎస్‌ఈఐఎస్) కింద ప్రోత్సాహకాలను 2 శాతం పెంచి బడ్జెట్ రూ.1,140 కోట్లు చేశారు.
- సెజ్‌లకు సరఫరా చేసే వస్తు, సేవలను జీఎస్టీ కింద సున్నా రేటుగా పరిగణిస్తారు.
- డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ చెల్లుబాటు కాలాన్ని 18 నెలల నుంచి 24 నెలలకు పెంచారు.
- లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించేందుకు గాను నూతన విభాగం ఏర్పాటు
- డేటా ఆధారిత విధాన చర్యలకు డీజీఎఫ్‌టీ పేరుతో అనలైటిక్స్ డివిజన్ ఏర్పాటు.
- విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు నూతన విధానం.
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ఉపాధి కల్పన
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ వాణిజ్య విధానంలో మరిన్ని ప్రోత్సాహకాలు
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఎగుమతులను ప్రోత్సహించడానికి
Comments
Post a Comment