CURRENT AFFAIRS

1.ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ అవార్డును 2017 సంవత్సరానికి క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) గెలుచుకున్నాడు.రొనాల్డో ఈ అవార్డు గెలుచుకోవడం ఇది ఐదోసారి. దీంతో మరో ఆటగాడు లయొనల్ మెస్సీ రికార్డును సమం చేశాడు. ఈ పోటీలో మెస్సీ రెండో స్థానంలో నిలవగా, నెయ్‌మార్‌కు మూడో స్థానం దక్కింది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాలన్ డి ఓర్ పురస్కారం 2017 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : క్రిస్టియానో రొనాల్డో

2.ఇండియన్ నేవీలో సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో డిసెంబర్ 8న సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించారు.Current Affairsస్వర్ణోత్సవాలకు త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన భారత నౌకాదళం దేశ రక్షణకే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇస్తున్న సహకారం ప్రముఖమైనదని కొనియాడారు.


భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ కల్వరి సబ్‌మెరైన్ సేవలు 1967లో ప్రారంభించారు. ఈ 50 ఏళ్లలో 25 సబ్‌మెరైన్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
 ఇండియన్ నేవీ సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ఇండియన్ నేవీ
ఎందుకు : సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
3.ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం(Wassenaar) లో భారత్ 42వ సభ్య దేశంగా చేరింది.Current Affairsఈ మేరకు డిసెంబర్ 7న వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరగడంతో పాటు కీలక రక్షణ, అంతరిక్ష రంగాల్లో అధునాతన సాంకేతికతలను ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది.

Wassenaar Arrangement on Export Controls for Conventional Arms and Dual-Use Goods and Technologies లేదా Wassenaar Arrangement అనేది ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు పనిచేస్తోంది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి :
 వాసెనార్‌లో 42వ సభ్యదేశం చేరిక
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : భారత్
ఎందుకు : రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇతర దేశాలతో అధునాతన సాంకేతికత పంచుకోవడానికి
3.శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 22న హైదరాబాద్ రానున్నారు.Current Affairsఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 26 వరకు బస చేస్తారు. భారత రాష్ట్రపతి ఏటా డిసెంబర్‌లో శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రావడం ఆనవాయితీ. ఈ సమయంలోనే దాదాపు 15 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలోకి సందర్శకులను అనుమతిస్తారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
 రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన షెడ్యూలు
ఎప్పుడు : డిసెంబర్ 22 నుంచి 26 వరకు
ఎక్కడ : రాష్ట్రపతి నిలయం, బొల్లారం, హైదరాబాద్
ఎందుకు : ఏటా డిసెంబర్‌లో శీతాకాల విడిదిలో భాగంగా
4.విశాఖపట్నంలో కురుసుర జలాంతర్గామి ఎదురుగా ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధవిమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 7న ప్రారంభించారు.Current Affairsఅనంతరం ఐఎన్‌ఎస్ డేగాలో భారత తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కాల్వరి స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ)లో ఈ-క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, ఇంక్యుబేషన్ సెంటర్ భవనాల శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయ మహిళలు ఆదర్శనీయమైన సేవలందిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డీఆర్‌డీవో సీనియర్ సైంటిస్ట్ టెస్సీ థామస్‌ను బాలికలు యువతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
 టీయూ 142 మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
6.చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత్ ర్యాంక్ ఆరు స్థానాలు దిగజారి 37కు చేరింది.Current Affairsఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 60 దేశాలకు సంబంధించి డిసెంబర్ 7న విడుదల చేసిన ‘చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ 2017’ ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా (2), హాంకాంగ్ (3), మలేషియా(4), ఆస్ట్రేలియాలు (5) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, ఎనర్జీ ఫైనాన్షియల్ సేవలు, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ విషయంలో భారత్ ర్యాంక్ తగ్గడానికి ప్రధాన కారణం రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతలు.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
 చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఎకనామిక్ ఇంటెల్లిజెన్స్ యూనిట్
ఎందుకు : రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో
7.ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో కుంభమేళాను డిసెంబర్ 7న ‘సాంస్కృతిక వారసత్వ సంపద’గా గుర్తించింది.Current Affairsఈ మేరకు దక్షిణ కొరియాలోని జెజూలో డిసెంబర్ 4 నుంచి 9 వరకు జరిగిన సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 12వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు శాంతియుతంగా హాజరయ్యే సమ్మేళనమే కుంభమేళా. 

క్విక్ రివ్యూ:
ఏమిటి :
 కుంభమేళాకు సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : యునెస్కో
ఎందుకు : ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే సమావేశం అయినందున
8.స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ డిసెంబర్ 7న ఆమోదించింది.Current Affairsఇంతకుముందు ఈ బిల్లును పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43-12 మెజారిటీతో ఆమోదించగా.. తాజాగా ప్రతినిధుల సభ (దిగువ సభ) 146-4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేసి 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
 స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత 
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎక్కడ : ఆస్ట్రేలియా
9.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.Current Affairsగతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 
ఆధార్ గడువు 2018 మార్చి 31 వరకు పొడిగింపు
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు అనుసంధానం చేసుకోవడానికి

Comments