1.శ్రీలంకతో డిసెంబర్ 6న ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకోవడం ద్వారా భారత్ 9 వరుస టెస్టు విజయాలతో ప్రపంచ రికార్డును సమం చేసింది.దీంతో ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల సరసన భారత్ నిలిచింది. ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 2015 నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై భారత్ వరుస విజయాలు సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 9 వరుస టెస్టు విజయాలతో ప్రపంచ రికార్డు సమం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : భారత్
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన వంటి వ్యవసాయ పథకాలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.టీవీల్లో ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి అక్షయ్‌ను ప్రచారకర్తగా నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 6న తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర వ్యవసాయ పథకాలకు ప్రచారకర్త నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అక్షయ్ కుమార్
ఎందుకు : టీవీ ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి
3.ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ 6న కీలక నిర్ణయం తీసుకున్నారు.టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అమెరికా విదేశాంగ శాఖను ఆదేశించారు. ‘జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం అని వారందరు కలిసే దేశాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు అమెరికా ముందుంటందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : జెరూసలేం మూడు గొప్ప మతాలకు ప్రధాన కేంద్రం అయినందున
నేచర్ ఫొటోగ్రాఫర్ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి ‘నరుటో’ ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను ‘పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి కొన్ని సెల్ఫీలు తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2017
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : సెలైన్స్ బ్రేకర్స్ (మీ టూ హ్యాష్‌ట్యాగ్)
ఎందుకు : తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్ ద్వారా వెల్లడించినందుకు
రెపో రేటు 6 శాతం.
రివర్స్ రెపో రేటు 5.75 శాతం.
2017-18 జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ
Comments
Post a Comment