CURRENT AFFAIRS

1.బాలీవుడ్ నటుడు శశికపూర్(79) డిసెంబర్ 4న ముంబైలో కన్నుమూశారు.ఈయన పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడు. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో కన్పించారు. 1961లో ధర్మపుత్ర సినిమాతో హీరోగా ప్రస్థానం ప్రారంభించి 116 చిత్రాల్లో నటించారు. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శశి కపూర్ 2011లో పద్మభూషణ్, 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నhటుడు శశికపూర్ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎక్కడ : ముంబై
ఎందుకు : మూత్రపిండాల సమస్యతో
2.తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే ఇకనుంచి ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనని వ్యవసాయ శాఖ పేర్కొంది.ఎరువుల కొనుగోలుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎరువుల కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : జనవరి 1, 2018
ఎవరు : రైతులు
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : సబ్సిడీ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి
3.ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గించింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఇందుకు కారణం దేశంలో ఆర్థిక రికవరీ బాగా నెమ్మదిగా ఉందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో (జీఈఓ) పేర్కొంది.
మొదటి త్రైమాసికంలో వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోగా, రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) ఈ రేటు 6.3 శాతానికి పెరిగింది. ఇటీవల మూడీస్ భారత్ రేటింగ్‌ను ‘బీబీబీ మైనస్’ స్థాయి నుంచి ‘బీబీబీ 2’ స్థాయికి పెంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఫిచ్ రేటింగ్ సంస్థ
ఎందుకు : ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉండటం వల్ల
4.ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక అందించే ఏషియన్ బిజినెస్ లీడర్ అవార్డుకు 2017 సంవత్సరానికి గాను మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ ఎంపికయ్యారు.గోల్డ్, డైమండ్ బిజినెస్ కేటగిరీలో ఈటీ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. రూ.30,000 కోట్ల టర్నోవర్‌తో ప్రపంచంలోనే టాప్-5 బంగారు వ్యాపార సంస్థల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌‌స సంస్థ ఒకటిగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈటీ ఏషియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్ 2017
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : మలబార్ చైర్మన్ ఎం. పి. అహ్మద్

Comments