1.
చైనాలో జరుగుతున్న 13వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో భారతీయ చిత్రం ‘గౌరు’ రెండు అవార్డులను గెలుచుకుంది.ఈ చిత్రంలో బాలనటుడిగా ప్రతిభ కనబర్చినందుకుగాను రిత్విక్ సాహోరె ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకోగా, నటి, గాయకురాలైన ఇలా అరుణ్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని భారత బాలల చలనచిత్ర సంఘం (సీఎఫ్‌ఎస్‌ఐ) నిర్మించింది. రామ్‌కిషన్ నందరామ్ చోయల్ దర్శకత్వం వహించారు. అనారోగ్యంగా ఉన్న తన బామ్మను కాపాడుకునేందుకు రాజస్తాన్‌కు చెందిన గౌరు అనే పదమూడేళ్ల బాలుడు సాగించిన ప్రయాణమే ఈ చిత్ర కథ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘గౌరు’ సినిమాకు కు బాలల చలన చిత్ర అవార్డులు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : రిత్విక్ సాహోరె (ఉత్తమ నటుడు), ఇలా అరుణ్ (ఉత్తమ నటి)
ఎక్కడ : అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం, చైనా
2.
భారత ఆర్థిక సాయంతో ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ డిసెంబర్ 3న ప్రారంభించాఈ పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలు కలుగుతుంది. ఇరాన్‌లోని సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్‌సలో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. చైనా పెట్టుబడులతో పాకిస్తాన్‌లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా దీనిని భారత్ ఇరాన్‌లో నిర్మించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘చాబహర్’ పోర్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఇరాన్
ఎందుకు : ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు
3.దేశవ్యాప్తంగా 2016లో 8132 మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది.సగటున రోజుకు 63 మందిని పోలీసులు రక్షించినట్లు పేర్కొంది. ఈ కేసుల్లో 58 శాతం మంది బాధితులు 18 ఏళ్లలోపు వారే. వీటిల్లో 3,579 కేసుల (44 శాతం)తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, రాజస్తాన్ (1,422 కేసులు), గుజరాత్ (548), మహారాష్ట్ర (517), తమిళనాడు (434) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 8 వేల మానవ అక్రమ రవాణా కేసులు నమోదు
ఎప్పుడు : 2016
ఎవరు : నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో
ఎక్కడ : దేశవ్యాప్తంగా
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ కొత్త సీఈవో నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : సలీల్ ఎస్ పరేఖ్
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ క్యాంపస్
ఎప్పుడు : త్వరలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : దివ్యాంగులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు
Comments
Post a Comment