1.బాలీవుడ్ నటి దియామీర్జా ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్తగా నియమితులయ్యారు.భారత్‌లో పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, సముద్రాల పరిరక్షణ, అడవుల సంరక్షణ తదితర అంశాలపై పలు కార్యక్రమాల ద్వారా ఆమె అవగాహన కల్పించనున్నారు. కేట్ బ్లాంకెట్, అన్నా హాతావే, ఏంజెలీనా జోలీ తదితర హాలీవుడ్ నటులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్త నియామకం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : బాలీవుడ్ నటి దియామీర్జా
ఎక్కడ : భారత్
ఎందుకు : కాలుష్యం, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి
2.ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ స్వర్ణ పతకం గెలుచుకుంది.నవంబర్ 30న జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, పర్వీనా, త్రిషాలతో కూడిన భారత జట్టు 230-227తో కొరియాపై గెలుపొందింది. సురేఖ ఇది వరకే కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్‌డ్ కాంపౌండ్ ఈవెంట్‌లో రజతాన్ని గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యాన్ని సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : జ్యోతి సురేఖ బృందం
3.
బీసీసీఐ మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు జాతీయ చాంపియన్‌గా నిలిచింది.గుంటూర్‌లో నవంబర్ 30న జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై 47 పరుగులతో గెలుపొంది టైటిల్‌ను కై వసం చేసుకుంది.
ఈ టోర్నీలో ‘బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ద టోర్నీ’గా ముంబైకి చెందిన జెమీమా (1013 పరుగులు) ఎంపికవగా, ఫాతిమా జఫర్ (26 వికెట్లు) ‘బెస్ట్ బౌలర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐ మహిళల అండర్-19 విజేత
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ఆంధ్ర జట్టు
4.
అమెరికాలోని అనహెమ్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మణిపూర్ వెయిట్ లిఫ్టర్ సయిఖోమ్ మీరాబాయి చాను రెండు బంగారు పతకాలు గెలుచుకుంది.చాను 48 కేజీల కేటగిరీలో స్నాచ్‌లో 85, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలతో మొత్తం 194 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా కరణం మల్లేశ్వరి తర్వాత (22 ఏళ్ల అనంతరం) ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మల్లేశ్వరి 1994, 1995 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌ల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెలిచింది.
ఈ ఈవెంట్‌లో 193 కేజీల బరువెత్తిన సుక్చరొన్ తున్యా (థాయ్‌లాండ్) రజతం గెలుపొందగా, సెగురా అనా (182 కేజీలు; ఐర్లాండ్) కాంస్య పతకం దక్కించుకుంది. డోపింగ్‌తో రష్యా, చైనా, కజకిస్తాన్, ఉక్రెయిన్, అజర్‌బైజాన్‌లకు చెందిన లిఫ్టర్లు ఇందులో పాల్గొనే అవకాశం కోల్పోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : సయిఖోమ్ మీరాబాయి చాను
ఎక్కడ : అమెరికా
ఎందుకు : 48 కేజీల విభాగంలో అధిక బరువు ఎత్తినందుకు
5.
హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో స్టార్టప్‌ల ‘పిచ్’ కాంపిటీషన్‌లో రాజస్తాన్‌కు చెందిన అజైతా షా తుది విజేత (గ్రాండ్ చాంపియన్)గా నిలిచారు.సదస్సును పురస్కరించుకుని స్టార్టప్ కంపెనీలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్‌స అండ్ టెక్నాలజీ (జిస్ట్)’ఆధ్వర్యంలో పిచ్ కాంపిటీషన్‌ను నిర్వహించారు.
అజైతా షా రాజస్తాన్‌లో ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె కృషి చేస్తుంది.ఆమెకు దాదాపు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టార్టప్‌ల పిచ్ కాంపిటీషన్ గ్రాండ్ చాంపియన్
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అజైతా షా
ఎక్కడ : జీఈఎస్ సదస్సు, హైదరాబాద్
ఎందుకు : మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషికి
6.దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.దశాబ్దకాలంలోనే పట్టణ జనాభా 36 శాతం పెరిగింది. 2001లో రాష్ట్రంలో 98.53 లక్షల పట్టణ జనాభా ఉండగా.. అది 2011లో 1.36 కోట్లకు పెరిగింది. 100 శాతం పట్టణ జనాభా ఉన్న హైదరాబాద్ జిల్లాలో రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది నివసిస్తున్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 70.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 57.70 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది. 31 జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన అర్థగణాంక వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
అర్థగణాంక వార్షిక నివేదిక ముఖ్యాంశాలు
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 31.51 లక్షల మంది వ్యవసాయంలో ఉన్నారు. కూలీ చేస్తూ ఉపాధి పొందుతున్నవారు 59.15 లక్షల మంది.
2015-16లో 21.80 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల పంటలు సాగవగా.. 51.45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న కమతాలు 62 శాతం ఉండగా.. 1-2 హెక్టార్ల వరకు ఉన్నవి 23.9 శాతం ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో కమతాల సగటు విస్తీర్ణం 1.12 హెక్టార్లుగా ఉంది.
రాష్ట్రంలో 1.63 కోట్ల మంది ప్రధాన వృత్తులతో ఉపాధి పొందుతున్నారు.
ఏడాదిలో 183.. అంత కంటే ఎక్కువ రోజులు పని చేసేవారు 1.37 లక్షలు. వీరిలో 22.42 లక్షల మంది ఎస్సీలు, 14.58 లక్షల మంది ఎస్టీలు.
ఓ మోస్తరు పనులతో 26.22 లక్షల మంది.. కుటీర పరిశ్రమలతో 7.77 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
గ్రామాల్లో వ్యవసాయం, వృత్తి పనులు, మోస్తరు పనులతో కాకుండా మిగిలిన రంగాల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వారు 64.99 లక్షలు. ఏ పనీ చేయని వారు 1.86 కోట్ల మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 13.58 శాతం. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 17.70 శాతం.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. ప్రతి 1,000 మంది పురుషులకు 988 మంది మహిళలుండగా.. 11 జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది.
నిర్మల్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 1,046 మంది మహిళలున్నారు. 1,044 మందితో నిజామాబాద్ రెండో స్థానంలో ఉంది. రంగారెడ్డిలో 1,000 మంది పురుషులకు 950 మంది, హైదరాబాద్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 954 మంది మహిళలు ఉన్నారు.
రాష్ట్రంలో ఆరేళ్లలోపు పిల్లల జనాభా 38.99 లక్షలు. మొత్తం జనాభాలో వీరు 11.14 శాతం.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 54.08 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 15.45 శాతం. ఎస్సీ జనాభాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,008 మంది మహిళలున్నారు.
రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31.77 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. ఎస్టీల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 977 మంది స్త్రీలు ఉన్నారు.
ప్రజల్లో జీవన స్థితిగతులు తెలిపే మానవాభివృద్ధి సూచికలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2015-16 మానవాభివృద్ధి సూచిక రాష్ట్ర సగటు 0.595గా ఉంది.
ఈ సూచికలో హైదరాబాద్ (0.82 శాతం)తో తొలిస్థానంలో నిలవగా.. రంగారెడ్డి (0.71 శాతం), ఖమ్మం (0.62 శాతం) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ అర్థగణాంక వార్షిక నివేదిక
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అర్థగణాంక శాఖ, తెలంగాణ ప్రభుత్వం
7.పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్), వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి.2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలానికి వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్రీయ గణాంకాల విభాగం (సీఎస్‌ఓ) నివేదిక నవంబర్ 30న ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతంతో పోలిస్తే క్యూ2లో ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబర్చింది.
నివేదిక ముఖ్యాంశాలు
- క్యూ2లో తయారీ రంగం 7 శాతం వృద్ధి నమోదు చేయగా సేవల రంగం వృద్ధి 7.1 శాతానికి పెరిగింది.
- మైనింగ్ రంగంలో వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదైంది.
- నిర్మాణ రంగం 2.6 శాతం; ఫైనాన్షియల్, బీమా, రియల్ ఎస్టేట్ ఇతర ప్రొఫెషనల్ సేవల రంగానికి సంబంధించి 5.7 శాతం వృద్ధి నమోదైంది.
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతరత్రా విభాగాల వృద్ధి రేటు 6 శాతంగా ఉంది.
- వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల రంగం క్యూ2లో 1.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
- స్థూల విలువ ఆధారిత(గ్రాస్ వేల్యూ యాడెడ్-జీవీఏ) వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్ కాలంలో 6.1 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 6.8% కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 5.6 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
ఎప్పుడు : జులై - సెప్టెంబర్
ఎవరు : కేంద్ర గణాంకాల విభాగం
ఉత్తర కొరియా తాజాగా పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి, జూలైలో పరీక్షించిన హవాసాంగ్-14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరకొరియాను పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అమెరికా రాయబారి నిక్కీహేలి
ఎక్కడ : ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి సమావేశంలో
ఎందుకు : ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే
ఓక్కీ అంటే బెంగాలీ భాషలో కన్ను అని అర్థం. తుపాను పేరును ఖరారుచేసే అవకాశం ఈసారి బంగ్లాదేశ్‌కు రావడంతో ఈ పేరును సూచించింది. సామాన్య ప్రజలకు సులువుగా అర్థం కావడానికి ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సాంఘిక సంఘం (ఇస్కాప్) కలసి 2000 సంవత్సరం నుంచి తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం తీసుకొచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓక్కి తుపాను 2017
ఎప్పుడు : నవంబర్ 30
ఎక్కడ : తమిళనాడు, కేరళలో
Comments
Post a Comment