SSC JOBS----- 3259

తాజా నోటిఫికేషన్‌ ద్వారా 3259 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇవి మూడు రకాలుగా ఉన్నాయి.
లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 898
పోస్టల్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 2359
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు: 2.
01.08.2018 నాటికి 18 నుంచి 27 ఏళ్ల వయసున్నవారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఎస్‌సీ/ ఎస్‌టీవారికి అయిదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు, పీడబ్ల్యూడీ వారికి వయఃపరిమితిలో పదేళ్ల మినహాయింపు ఉంది.
లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌: ఈ పోస్టుకు ఎంపికైనవారు తమ ఆఫీసులకు వచ్చే ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, మెయిల్స్‌ను పరిశీలించి, వాటిని పైఅధికారులకు పంపడం లేదా ఆఫీసురీత్యా ఎవరికైనా కాల్స్‌, మెయిల్స్‌ పంపడం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల శాలరీ స్లిప్‌లను తయారు చేయడం, ఆఫీసుకు సంబంధించిన ముఖ్యపత్రాలను భద్రపరచడం, అవసరమైన సమయంలో వాటిని పైఅధికారులకు అందజేయడం వంటి పనులుంటాయి. డేటా, ఫైల్స్‌, పత్రాలను జాగ్రత్త చేయడంతోపాటు కార్యాలయ రోజువారీ పనులు సక్రమంగా నడవడంలోనూ క్లర్‌ü్క ప్రమేయం ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌: ఇంగ్లిష్‌/ హిందీలో లెటర్లను టైప్‌ చేయడం, దరఖాస్తులను పూర్తి చేయడం, ఆఫీసుకు వచ్చిన సమాచారాన్ని కుదించి క్లుప్తంగా పైఅధికారులకు చేరవేయడం, కంప్యూటర్‌లో సంస్థకు సంబంధించిన ఫైల్స్‌, ఇతర ముఖ్య సమాచారాన్ని భద్రపరచడం వంటివి చేయాలి.
పోస్టల్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌: జిల్లా, మండల కేంద్రాలుగా పనిచేసే పోస్టాఫీసుల్లో బుక్‌ వర్క్‌, సిస్టమ్‌ వర్క్‌ చూసుకుంటూ మిగిలిన ఉద్యోగులతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ రోజువారీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించాలి.
విద్యార్హతలు 
* 01.08.2018 నాటికి ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసి ఉండాలి.
* దూరవిద్యా విధానంలో డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
* చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పరీక్షకు అర్హులే. కాకపోతే 01.08.2018 నాటికి కోర్సు పూర్తిచేసి సర్టిఫికెట్లు పొందివుండాలి.
అభ్యర్థులు తమ వివరాలను http://www.ssconline.nic.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. చివరగా వారి దరఖాస్తును ప్రింట్‌ తీసుకుని, జాగ్రత్త చేసుకోవాలి. మహిళలకూ, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు ఉండదు. జనరల్‌, ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ.100ను ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు: 
* దరఖాస్తు పూర్తిచేయడానికి: 18.12.2017
* టయర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్ష: 04.03.2018 నుంచి 26.03.2018 వరకు
* టయర్‌-2 డిస్క్రిప్టివ్‌పరీక్ష: 08.07.2018
పరీక్ష కేంద్రాలు: 
ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం
తెలంగాణ: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌
టయర్‌-1 పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ మేథమెటిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి.
మూడు అంచెల్లో... 
అభ్యర్థుల ఎంపిక మూడు అంచెల్లో జరుగుతుంది.
టయర్‌-1: అభ్యర్థులు ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది. 60 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. నాలుగు సెక్షన్లలో ప్రతీదాని నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.5 రుణాత్మక మార్కులున్నాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో (ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు) ఉంటాయి.
టయర్‌-1: పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించినవారికి టయర్‌-2 డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. టయర్‌-1 పరీక్షలో కనీసార్హత మార్కు పోస్టును బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కో పోస్టుకు దానికి అనుగుణంగా అర్హత మార్కులను నిర్ణయిస్తారు.
టయర్‌-2: ఇది డిస్క్రిప్టివ్‌ పరీక్ష. దీనిలో లెటర్‌ రైటింగ్‌, అప్లికేషన్‌ రైటింగ్‌, ప్రెసీ అంశాలను పరీక్షిస్తారు. సమయం 60 నిమిషాలు. పరీక్షను పెన్ను-పేపర్‌ విధానంలో రాయాల్సి ఉంటుంది. 100 మార్కులు కేటాయించిన ఈ పరీక్షకు కనీసార్హత మార్కులు- 33. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయవచ్చు.
టయర్‌-3: టయర్‌-2 పరీక్షలోనూ కనీస అర్హత మార్కులు సాధించినవారికి టయర్‌-3 టైపింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్ష అయిన టయర్‌-3లో పోస్టునుబట్టి టైపింగ్‌ వేగాన్ని నిర్ణయిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుకు 15 నిమిషాల్లో 2000-2200 అక్షరాలను పద రూపంలో తప్పులు లేకుండా టైప్‌ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (సీఏజీ) పోస్టుకు 15 నిమిషాల్లో 3500 అక్షరాలను పదరూపంలో తప్పులు లేకుండా టైప్‌ చేయాలి.
గమనిక: డేటా ఎంట్రీ ఆపరేటర్‌- కంట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) పోస్టుకు పోటీపడేవారు సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టులను చదివుండాలి. డిస్క్రిప్టివ్‌ పరీక్షకూ ఇప్పటినుంచే సన్నద్ధమవడం మంచిది. 4, 5 పేరాల్లో ఉన్న సమాచారాన్ని కుదించి, 1-2 పేరాల్లో రాయడం అలవాటు చేసుకోవాలి.
ఏ సబ్జెక్టును ఎలా చదవాలి?
జనరల్‌ ఇంటలిజన్స్‌ 
రీజనింగ్‌, జనరల్‌ ఇంటలిజన్స్‌, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. అన్ని విభాగాలలో ప్రశ్నలు సులువుగా ఉండి, ఎక్కువ మార్కులు పొందటానికి అవకాశం ఇచ్చే విభాగమిది.
నంబర్‌ సిరీస్‌, రాంగ్‌ నంబర్‌ సిరీస్‌, లెటర్‌ సిరీస్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, రక్త- సంబంధాలు, సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌, సిల్లాజిజమ్‌, స్టేట్‌మెంట్స్‌-కంక్లూజన్స్‌, ఎజంప్షన్స్‌, నంబర్‌ పజిల్స్‌, మాట్రిక్స్‌ ఫిగర్‌, మిర్రర్‌ ఇమేజ్‌, వాటర్‌ ఇమేజ్‌, కంప్లీట్‌ ఫిగర్‌, క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలో ఉన్న పూర్తి సమాచారం ఉపయోగించి వాటిలోని తర్కం పట్టుకొని సమాధానం గుర్తించటానికి ప్రయత్నిస్తే, తక్కువ సమయంలో సమాధానాలను గుర్తించవచ్చు. తర్కం (లేదా) నిబంధన ఆధారంగా ఇవ్వనున్న ప్రశ్నలు కాబట్టి పరీక్షకు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే తప్పులు లేకుండా సరైన సమాధానాలను గుర్తించవచ్చు.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 
25 ప్రశ్నలు ఉండే ఈ విభాగంలో అరిథ్‌మెటిక్‌, డేటా ఎనాలిసిస్‌, మాథమెటిక్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌, డేటా ఎనాలిసిస్‌ల నుంచి 15 ప్రశ్నలు, మాథమెటిక్స్‌ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌లో శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం -పని, కాలం-దూరం, ఏజెస్‌, ట్రెయిన్స్‌, బోట్స్‌ వంటి అంశాలను క్షుణ్ణంగా అభ్యాసం చేయాలి. క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాల నుంచి 3- 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మాథమెటిక్స్‌లో త్రికోణమితి, క్షేత్రగణితం, రేఖాగణితం అంశాలు చాలా ప్రధానమైనవి. అన్ని అంశాల్లోని ముఖ్యమైన ఫార్ములాలను పట్టికల రూపంలో నోట్స్‌గా తయారుచేసుకోవాలి. ముఖ్యమైన విషయాలను పాయింట్ల రూపంలో రాసుకుంటే ప్రిపరేషన్‌ విధానం మెరుగ్గా ఉంటుంది. సింప్లిఫికేషన్‌ మీద దృష్టి సారించి, తక్కువ సమయంలో సమాధానం రాబట్టడానికి అవసరమైన షార్ట్‌కట్స్‌ విధానాలను అలవాటు చేసుకోవాలి. డేటా ఎనాలిసిస్‌, డేటా ఇంటర్‌ ప్రిటేషన్స్‌ లోని అన్ని మోడల్‌ ప్రశ్నలనూ సాధన చేయాలి.
ఇంగ్లిష్‌
ఎక్కువమంది అభ్యర్థులు ఇబ్బంది పడేది ఈ ఇంగ్లిష్‌ సెక్షన్‌లోనే. గ్రామర్‌ మీద పట్టుతో పాటు పఠన నైపుణ్యాలు (రీడింగ్‌ స్కిల్స్‌) ఉన్నట్లైతే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందవచ్చు. బ్యాంకు పరీక్షలలోని ప్రశ్నలు సమాధానాలు గుర్తించాలంటే పఠన నైపుణ్యాలు ఉండాల్సిందే. మిగిలిన పరీక్షల్లోని ప్రశ్నలు ఎక్కువగా గ్రామర్‌కు సంబంధించి ఉంటాయి. రోజువారీ ఆంగ్ల దినపత్రిక చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, క్లోజ్‌టెస్ట్‌, ఫిల్‌ ఇన్‌ద బ్లాంక్స్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, కరెక్షన్స్‌పై శ్రద్ధ పెడితే ఎక్కువ మార్కులు వస్తాయి. Antonyms, Synonyms, Articles ప్రశ్నలు ఎక్కువ సాధన చేసి ఏయే సందర్భాలలో ఏ పదాలు వాడాలో గుర్తించాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్‌ వార్తలు వినటం చేయాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తూ, గత పరీక్షలలో వచ్చిన ప్రశ్నలను బట్టి ప్రిపరేషన్‌ నోట్స్‌ తయారుచేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు.
జనరల్‌ ఎవేర్‌నెస్‌
కరంట్‌ అఫైర్స్‌, సోషల్‌, సైన్స్‌ అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఏవిధంగా వస్తున్నాయో గమనించడం ముఖ్యం. ముఖ్యమైన సమాచారం వరకు నోట్స్‌ తయారుచేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువసార్లు చదివి సమాచారం గుర్తించుకునేలా చదువుకోవాలి. ఎక్కువ సమాచారం గుర్తుంచుకోవడం ద్వారా ఎక్కువ ప్రశ్నలకు జవాబులను తక్కువ సమయంలో గుర్తించవచ్చు. 8,9,10 తరగతుల హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ పాఠ్యాంశాలు చదివి, ఆబ్జెక్టివ్‌ విధానంలో అడగటానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో, అలా నోట్స్‌ తయారుచేసుకోవాలి. అలాగే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాల నోట్స్‌ కూడా తయారు చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలు చూడటం ద్వారా ఏ అంశాలు ముఖ్యమైనవో గుర్తించవచ్చు. దానికి అనుగుణంగా చదివితే మెరుగైన ఫలితాలు వస్తాయి.
కరంట్‌ అఫైర్స్‌కు సంబంధించి ప‌రీక్ష తేదీకి 8 నెల‌ల‌కు ముందు ముఖ్యాంశాల‌ను రాసుకోవాలి. జాతీయ అంతర్జాతీయ విషయాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఉపగ్రహ ప్రయోగాలు, స్పోర్ట్‌, అవార్డ్స్‌, వైరస్‌, వాక్సిన్‌, ముఖ్యమైన ప్రదేశాలు, వార్తలలో వ్యక్తులు, పుస్తకాలు- రచయితలు, కేంద్రప్రభుత్వ పథకాలు, కేంద్ర మంత్రులు- వారి శాఖలు, రాష్ట్రాలు-గవర్నర్లు, దేశాలు-ప్రధాన మంత్రులు- రాజధానులు- కరెన్సీ స‌మాచారంపై దృష్టి సారించాలి

Comments