CURRENT AFFIERS

1.ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నవంబర్ 28న నియమితులయ్యారు.ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రదీప్‌సింగ్ 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ చైర్మన్‌గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ నుంచి ప్రదీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
2.హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కలసి నవంబర్ 28న ప్రారంభించారు.aaనంతరం మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. అక్కడి నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్) జరిగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)కి బయల్దేరి వెళ్లారు. మెట్రో తొలిదశలో నాగోల్ నుంచి మెట్టుగూడ, అమీర్‌పేట్, మీదుగా మియాపూర్ వరకు రవాణా సేవలు ప్రారంభమయ్యాయి.
మెట్రో రైలు ప్రారంభంలో లోకో పైలట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేపరాల గ్రీష్మ ఉన్నారు. దీంతో ఆమె దేశంలోనే మెట్రో తొలి మహిళా లోకోపైలట్‌గా రికార్డులకెక్కారు
3.ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్ 15వ ఫైనాన్‌‌స కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం సహా పలు అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షిస్తుంది. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలను కమిషన్ పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. అక్టోబర్ 2019 నాటికి కమిషన్ తన నివేదికను సమర్పిస్తుంది. మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. 15వ ఫైనాన్స్ కమిషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలంపై దృష్టి సారిస్తుంది. 14వ ఫైనాన్‌‌స కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయి్యంది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకూ సంబంధించిన కాలానికి ఈ కమిషన్ సిఫారసులు చేసింది.
Finance CommissionYear of EstablishmentChairmanOperational Duration
First1951K. C. Neogy1952–57
Second1956K. Santhanam1957–62
Third1960A. K. Chanda1962–66
Fourth1964P. V. Rajamannar1966–69
Fifth1968Mahaveer Tyagi1969–74
Sixth1972K. Brahmananda Reddy1974–79
Seventh1977J. M. Shelat1979–84
Eighth1983Y. B. Chavan1984–89
Ninth1987N. K. P. Salve1989–95
Tenth1992K. C. Pant1995–2000
Eleventh1998A. M. Khusro2000–2005
Twelfth2002C. Rangarajan2005–2010
Thirteenth2007Dr. Vijay L. Kelkar2010–2015
Fourteenth[4]2013

Comments